
ఎలా చదవాలి?
ఒక పాఠం అర్థం చేసుకోటానికి మంచి పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో అనే టెక్నిక్ స్టూడెంట్స్కి బాగా పనికొస్తుంది. దాని అసలు అర్థం ఇదే. దీనినే ఎస్ క్యూసిక్స్ అర్ అంటారు. How to read? ఎలా చదవాలి?

- S = Survey (సర్వే)
- Q = Questions (ప్రశ్నలు)
- R = Read (చదవాలి)
- R = Recite (వల్లెవేయాలి)
- R = Re Read (మళ్ళీ చదవాలి)
- R = Revise (మననం చేసుకోవాలి)
- R = Recall (గుర్తు చేసుకోవాలి)
- R = Reproduction (నోట్ పుస్తకంలో రాయాలి)
సర్వే అంటే పాఠాన్ని మొత్తం
సర్వే అంటే పాఠాన్ని మొత్తం ఒకసారి చదివేయాలి. దాని సారాంశం మొత్తం అర్ధం కాకపోయినా విషయం తెలుస్తుంది. పాఠ్యాంశం ఏమిటి? దేని గురించి వంటి ప్రశ్నలు వేసుకోవాలి. వాటికి సమాధానం తెలుసుకోవాలి. ఇకపోతే ‘6′ “R” లు గురించి మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది. How to read? ఎలా చదవాలి?
రీడ్” అంటే
“రీడ్” అంటే పాఠాన్ని అర్థమయ్యేలా చదవాలి. “రిసైట్” అంటే మనసులో వల్లె వేసుకోవాలి. “రీరీడ్” అంటే పాఠాన్ని మళ్ళీ చదవాలి. “రివ్యూ” అంటే, సారాంశం పదే పడే అనుకోవాలి. “రీకాల్” అంటే గుర్తు తెచ్చుకోవాలి. చివరిగా “రీ ప్రొడక్షన్” అంటే తెలిసినది పుస్తకంలో రాసుకోవాలి. How to read? ఎలా చదవాలి?
దీనికొక గంట పట్టవచ్చు. కానీ ఈ ప్రక్రియ వలన ఒక పాఠం పూర్తిగా అర్థమవుతుంది. పాఠం concept తెలుస్తుంది.
పాఠాన్ని బట్టీ పట్టే అలవాటున్న వారు, ఈ క్షణం నుంచే SQOR సాధన చేయండి. How to read? ఎలా చదవాలి?
ఎందుకు చదవాలి? https://vanewstimes.in/

- నేనొకసారి ఒక కాలేజి సెమినార్లో మాట్లాడుతూ “మీరెందుకు చదువుతున్నారు. చెప్పండి” అని అడిగాను.
- 5 శాతం మంది “డబ్బుకోసం” అన్నారు.
- 9 శాతం “ఉద్యోగం కోసం”
- 11 శాతం “తల్లిదండ్రుల కోసం”
- 12 శాతం “చదవక తప్పదు కాబట్టి” అన్నారు.
- 15 శాతం “ప్రభుత్వం రీఎంబర్స్మెంటు స్కీము ఉంది కనుక” అన్నారు. మిగతావారు “సక్సెస్ కోసం” అన్నారు. వీరే కాక, “ఇంటికి దగ్గరే కాలేజీ ఉంది కాబట్టి” అనీ, “ఫ్రెండ్సుతో ఎంజాయ్ చెయ్యటానికి” అన్నవారు కూడా ఉన్నారు. How to read? ఎలా చదవాలి?
చదువు వలన
చదువు వలన కొత్త ప్రపంచం చూడగలుగుతాము. తెలియని విషయాలు తెలుసుకుంటాం. కొత్త మనుషులు, వారి ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. మారుతున్న సమాజంలో మీరు భాగస్వామి అవుతారు.
మీ చుట్టూ ఉన్న పరిసరాలను కొత్త కోణంలో ఆలోచించి మార్చగలుగుతారు. తరతరాలుగా మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకుని లౌకిక జ్ఞానం పెంచుకోని సాటివారికి కొత్త లోకాన్ని పరిచయం చెయ్యగలుగుతారు.
మాటతీరు మారుతుంది, కొత్త పదాలు ప్రయోగిస్తారు. How to read? ఎలా చదవాలి?
ఆచార వ్యవహారాలను అవసరాన్ని బట్టి మార్చుకుంటారు. ఆరోగ్యం పట్ల సంపూర్ణ
అవగాహన పెరుగుతుంది.
ఇవి చాలా? ఇంకా కావాలా? అందుకే కాలేజీలో చేరిన వారంతా చదువు పూర్తి చేసి విజయం సాధించండి. సమాజానికి సహాయపడండి.
ఇక ఛార్జి తీసుకోండి ఇప్పుడు మీ భవిష్యత్తుకు
హైస్కూలు చదువు వరకు మీ చదువు, ఇతర వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులు ఛార్జీ తీసుకున్నారు. ఇప్పుడు మీరు కాలేజి చదువుకి వచ్చారు. ఇక మీ గురించి మీరు ఆలోచించాలి. కొత్త ఉద్యోగం ఛార్జి తీసుకున్నట్లుగా ఇప్పుడు మీరు కొత్త జీవితం ఛార్జి తీసుకోవాలి. మీ చదువు, మీ వైఖరి, మీ పరిచయాలు, మీ లక్ష్యం, మీ భవిష్యత్తు గురించి మీరిప్పుడు ప్రణాళిక వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాటిలో ముఖ్యమైనవి How to read? ఎలా చదవాలి?
1) మీరింతవరకు నేర్చుకున్నది వేరు – నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
2) చూసిన ప్రపంచం చిన్నదే – చూడాల్సింది ఇప్పుడే మొదలైంది.
3) స్పష్టమైన లక్ష్యాలు లేవు – ఇప్పుడు ఏకైక లక్ష్యం వైపు సాగాలి.
4) గతంలో కమ్యూనికేట్ చేశారు – ఇప్పుడు కనెక్ట్ అవుతారు.
5) కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి – నిరంతర సాధన చేయాలి.
6) భావావేశాలపై అదుపు సాధించాలి – ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి.
7) ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి.
8) తమలోని బలహీనతలను బలాలుగా మార్చుకోవాలి.
9) కొత్త అవకాశాలు వెతకాలి – కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలి.
10) సెల్ఫ్ మేనేజ్మెంట్ టెక్నిక్కులు తెలుసుకోవాలి.
11) పై చదువుల అవకాశాలను పరిశీలించాలి. డిగ్రీతో ఆపకూడదు.
చివరిగా SHAPE (Style, Habits, Attitude, Preferences and experiences) తెలుసుకోవాలి. అవసరాన్ని బట్టి తగువిధంగా మార్చుకోవాలి. How to read? ఎలా చదవాలి?
ప్రశాంతతకి పంచసూత్రాలు
ప్రశాంతతకి పంచసూత్రాలు How to read? ఎలా చదవాలి?
మీరు చదువులో ఎంత మేధావులైనప్పటికీ, సాటి విద్యార్థినీ విద్యార్థులతో కలసి మెలసి కుటుంబ సభ్యుల్లా ఉన్నప్పుడు మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి స్టూడెంట్ ఇక్కడ వివరించిన ఐదు సూత్రాలను పాటించగలిగితే ప్రశాంతంగా చదువుకోవచ్చు.
- తెలివైనవారిని చూసి అసూయపడకూడదు. వారిని అభినందించాలి. వారితో స్నేహంగా ఉంటే అసూయ దగ్గరికి రాదు.
- దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చటం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా పేదవారు, ఇతర సమస్యలున్న వారితో ప్రేమగా ఉండండి.
- ఆనందంగా ఉండేవారితో స్నేహం చేయండి. కొంతమంది చదువులో అద్భుతాలు చేయకపోయినా, మంచి మార్కులు తెచ్చుకుంటారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వారితో స్నేహం మంచిది.
- ఒక స్టూడెంట్ ప్రవర్తన బాగాలేనప్పుడు, మీరు వారిపైన చర్య తీసుకోకుండా, తగిన వారితో చెప్పించాలి తప్ప, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి.
- కొత్తగా కాలేజిలో చేరిన విద్యార్థులకు కొన్ని ఆకర్షణలు ఉంటాయి. ఆ ఆకర్షణలను అదుపులో ఉంచుకుని ఏది తప్పు? ఏది ఒప్పు? అనే జ్ఞానం అలవర్చుకోండి.
- ఈ పంచసూత్రాలు చదవటానికి చాలా సులువైనవిగా అనిపించినా, సందర్భం వచ్చినప్పుడు, వాటిని అమలుపరచాలి. అలా చేసినందువలన కాలేజి జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. మంచి ఆరోగ్యం, ఆలోచనలతో బయటపడవచ్చు. How to read? ఎలా చదవాలి?
For more inspiring content, visit the
Vihaan Adhithan Official Website to explore valuable insights and updates.