💰Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు 2026

https://vihaanadhithan.com/


వ్యాపార విజయ రహస్యాలు Business Success Secrets

  • పోటీ ఆధారిత కార్యక్రమాలను విరివిగా ప్రవేశపెట్టే అంతర్జాతీయ పోటీ రంగంలో మిమ్మల్ని మీరు అగ్రశ్రేణిలో వుంచు కోవాలంటే సాధారణ స్థాయి నిర్వహణా సామర్ధ్యం, వ్యవహార దక్షత మాత్రమే సరిపోదు. విజయవంతమైన వ్యాపారానికి కేవలం ఇవి మాత్రమే పెట్టు బడులుకావు. ఆత్మావలోకన వ్యక్తిత్వ వికాసం వీటిని కూడా మన పెట్టుబడులుగానే భావించి వ్యాపారం చెయ్యాలి.

Personal and organizational success వ్యక్తిగత మరియు సంస్థాగత విజయం

  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు వ్యక్తిగత, సంస్థాగత విజయంలోని బిడీకృతమై వున్న అంశాలేమిటో తెలుసుకోవటానికి మానవుడు సాగించే అన్వేషణ… మానవ జాతి ఆవిర్భావ మంత పురాత నమైంది గ్రీకులు రోమనుల కాలం నుండి అనేక గొప్ప రచయితలు, తత్వవేత్తలు మనిషిని నేతగా నిలబెట్టే దేమిటా అనే ప్రశ్నలతో పోరాటం సల్పుతూనే వున్నారు. వివిధ రకాల వ్యక్తులలో వివిధ రకాలుగా దర్శనమిచ్చే విజయ రహస్యాల మధ్య విస్తృతమైన వైవిధ్యం ఎందువలన ఏర్పడిందో తెలుసు కోవటానికి ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి.
  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలుఅనాదిగా మనిషి విజయానికి ప్రాముఖ్యత నిస్తూనే వున్నాడు. ఏదో ఒక రూపంలో విజయాన్ని కాంక్షిస్తూ, తపిస్తూ జీవిస్తూనే వున్నాడు. అయినప్పటికీ సార్వజనీనమైన సిద్ధాంత రూపకల్పన నేటికీ అసాధ్యంగానే పరిణమించి వుంది. ఏం చేస్తే విజయం లభిస్తుందో, ఏ ప్రక్రియలు అవలంబిస్తే విజయం తధ్యంగా లభిస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో యుగాలు గడిచిపోతునే వున్నాయి.
    ఎప్పటికప్పుడు కొత్త భావనలు పైకి వెలుస్తూ, అంతకు ముందు రాజ్యమేలిన భావనలను తోసి పుచ్చుతునే వున్నాయ్.

Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు వ్యాపార రంగం మాటలలో చెప్పాలంటే, ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేయటానికి కావల్సిన మూలకాలను గుర్తించడం గత 150 సం॥లుగా గణనీయమైన పరిణామానికి, మూల్యాంకనకు దారితీస్తూనే ఉంది. ఈ మూల్యాంకన ఫలితంగా కార్యరంగ నిర్వాహకులు ఇపుడు విస్తృతమైన ఫిలాసఫీలకు, చట్రాలకు, పరికరాలకు ఎదురుగా నుంచుని తమను తాము అభివృద్ధిపర్చుకోవడమెలాగో తర్జన భర్జనలు పడుతునే వున్నారు. ఈ విస్తృతమైన వైరుధ్యమంతా తేలుస్తున్నదొక్కటే! వ్యాపార విజయ సాధనకు విభిన్నమైన మార్గాలున్నాయని, ఆయా మార్గాలన్నిటికీ ఒక్కొక్క దానికి దేని పరిమితులు దానికి వున్నాయని అలాగే దేని నాణ్యత దానిదేనని బహిర్గతపరుస్తున్నది.

Birth of “Personality Theory””వ్యక్తిత్వ సిద్ధాంతం” జననం

Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు గత శతాబ్దంలో మనస్తత్వ శాస్త్రం పురోగమించడం మొదలయ్యింది. ఈ పురోగమనం అనేక నూతన సిద్దాంతాల మార్గాన్ని సుగమం చేసింది. ఈ నేపథ్యంలో సర్ ఫ్రాన్సిస్గాల్టన్ వంటి ప్రభృతులు “పెర్సనాలిటీ థియరీ” వంటి సిద్ధాంతాలకు బాటలు వేశారు. మానవ నాయకత్వ లక్షణాలను వ్యక్తీకరించే విశేషణాలను గాల్టన్ వంటి వారు నిశితంగా పరిశీలించారు. అనేక మానవ స్వాభావిక లక్షణాలను ఒక గొడుగు క్రిందికి చేర్చి అందరికీ అర్థమయ్యేలా వర్గీకరించడం జరిగింది.

Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు వ్యక్తిగత ప్రవర్తనను ప్రభావితం చేసే మూర్తిమత్వపు కారకాలకు మనస్తత్వవేత్తలు పునాదులు వేశారు. ఇలా పుట్టిన పెర్సనాలిటీ థియరీలు ఇపుడు ఆధునిక యుగంలో మానవ విశిష్టతలను గణించడానికి వీలైన విస్తృతమైన పరిజ్ఞానాన్ని, సైకోమెట్రిక్స్, వంటి సాధనాలను తయారు చేయడానికి గణనీయమైన ప్రగతికి దోహద పడుతున్నాయి. ఒక వ్యక్తి పెర్సనాలిటీని వైఖరిని స్పష్టంగా అంచనా వేయడం ద్వారా అతని ఉద్యోగ సామర్ధ్యాన్ని పసిగట్టే వీలు ఏర్పడ్తుంది. నవీన యుగంలో పెరుగుతున్న పారిశ్రామిక పరిణామాలలో వ్యవస్థలు ఉద్యోగుల నియామకాలలో ఈ సాధనాల వుపయోగం ఎక్కువ కొనసాగింది.

Era of scientific rule శాస్త్రీయ పాలన శకం

A movement based on increasing competition పెరుగుతున్న పోటీ ఆధారంగా ఒక ఉద్యమం

  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్లను అనుసరించడం ద్వారా ఫలితాత్మకమైన పాలనా సామర్ధ్యాన్ని ఒక సంస్థలో నెలకొల్పేందుకు శాస్త్రీయ పాలన ఆవిర్భావం 20వ శతాబ్దంలో ముఖ్య పాత్ర వహించింది. రెండు ప్రపంచ యుద్ధాలనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి శాతం అపరిమిత స్థాయిలో పెంపొందించుకోవల్సిన అవసరం ఏర్పడిన సంధర్భంలో శాస్త్రీయ పాలన పరిశ్రమలకు, ఉత్పత్తిరంగాలకు దోహదపడింది. విజయవంతమైన పాలనా సామర్థ్యాన్ని నెలకొల్పటానికి శాస్త్రీయ పాలన అందించే ప్రత్యేక టెక్నిక్ లు సాధన ప్రయోగం నిర్వాహకుల వృత్తిపరమైన ప్రయత్నాలను గణనీయంగా అభివృద్ధిపరిచింది ఈనాటికీ పాలనా విజయానికి వ్యాపార విజయానికి ఈ శాస్త్రీయ పాలన ఒక మాతృ సిద్ధాంతంగా విరాజిల్లుతుంది.
  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు పెరుగుతున్న పోటీ ఆధారంగా ఉద్యమం
    పెరుగుతున్న గ్లోబలైజేషన్, పోటీ దృక్పధాలలో నెలకొన్న ఆధునిక పరిస్థితులు అనేక వ్యవస్థలు ప్రత్యామ్నాయ ప్రయత్నాలను అన్వేషించ వల్సిన బలాత్కార పరిస్థితులకు దారితీసాయి. పాలనా సామర్థ్య అభివృద్ధి నేపధ్యంగా పోటీ ఆధారిత ఉద్యమాలు బ్రిటన్ వంటి దేశాలలో విప్లవాత్మకమైన పరిణామాలను జనింపచేశాయి.
  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు సాంప్రదాయక విధానాల స్థానే మరింత ఎక్కువ సాధన ప్రయోగం చేయదగ్గ అంశాలకు ప్రాధాన్యత హెచ్చింది. “నీకు తెలిసింది ముఖ్యంకాదు ఇక్కడ నువ్వేం సాధించావన్నది ముఖ్యం” అనే ధోరణికి ప్రాముఖ్యత పెరిగింది. మనిషి సాధించిన విజ్ఞానముకన్నా సాధించిన ఉత్పాదిక విజయం ప్రామాణికమైంది. ఫలితంగా వ్యవస్థలన్ని పోటీ ఆధారిత కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రదర్శించదగిన ఆచరణయోగ్యమైన నైపుణ్యాలకు ఉత్పాదన రంగంలో అభివృద్ధి సాధనకు పెద్దపీట వేయడం జరిగింది.

Modern approach నవీన విధానం

  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు అయినప్పటికీ ఆచరణయోగ్యమైన విధానాలను ప్రవేశపెట్టడం ఒక్కటే అన్ని సమస్యలకు జవాబులను అందివ్వలేకపోతోంది. ఒక ప్రక్క అనూహ్యంగా పెరుగుతున్న జటిలమైన సమస్యలు తార్కిక విధినిర్వహణా ప్రయత్నాలు మాత్రమే తమ సమస్యలకు పరిష్కారాన్ని అందివ్వలేవని పలు కంపెనీలు తెలుసుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈ కంపెనీలు విధుల విధానాల స్థానే స్ఫూర్తి దాయక ప్రయత్నాల పద్ధతులను అమలు చేసే దిశగా తమ ధోరణిని మార్చుకుంటున్నాయి.

  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు ఉదాహరణకు ఇటీవల కంపెనీలు ఆచరిస్తున్న “కస్టమర్ కేర్” పద్ధతి కస్టమర్లను పొందే క్రమంలో ఇంతకాలం ఈ నైపుణ్యం కేవలం విధినిర్వహణా సామర్థ్యంగానే పరిగణించడము జరిగింది. కానీ ఈనాడు ఏర్పడుతున్న విప్లవాత్మక పరిణామాల నేపథ్యంలో ఇది కేవలం విధి నిర్వహణా సామర్థ్యమే కాకుండా వినియోగదారులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆనందకరమైన మనోభావాలను ఏర్పరచుకునే విధంగా మార్చే ఒక ప్రత్యేకమైన సామర్ధ్యంగా పరిగణించడం జరుగుతుంది.
  • సాంకేతిక పరిష్కారాలను కనుగొనడం ఒక్కటే వ్యాపార లేదా పాలనా విజయాలకు దోహదపడదని.. దీర్ఘకాలిక సమస్యలకు వేరే కొత్త విధానం చేపట్టడం మంచిదని పాలనా ప్రపంచం గుర్తించింది. ఈ నేపథ్యంలో వృత్తిపరమైన నైపుణ్యం గల వ్యక్తులకన్నా మరింత ఎక్కువ సామర్థ్యము గలవారిని ఎంచుకోవడం జరుగుతుంది.
  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు వ్యవస్థాగతమైన మనోభావాలను ఉత్కంఠభరితమైన ప్రయత్నాలకు పరస్పర కృషి సామర్ధ్యాలను మెచ్చుకుని ఒకరితో ఒకరు సహకరించుకోగల సమిష్టి కలయికకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాపార లావాదేవీలలో వ్యవహార దక్షత ఒక్కటే సరిపోదని, నిర్వాహకులు పరిధికి మించిన ఆలోచన విధానంతో తమ వ్యవహార దక్షతను మరింత మెరుగుపర్చుకోవల్సి వున్నదని పలు వ్యవస్థలు గుర్తించాయి.

Modern methods in management నిర్వహణలో నవీన పద్ధతులు

  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు ఇటీవల కాలంలో పాలనా పద్ధతుల్లో శాస్త్రీయ విధానాల కన్నా మానవ సంబంధాల విధానాలను ఎంచుకునే దిశగా నూతన సంస్థలు ఎగబడుతున్నాయి. అందుచే ఉత్పాదకరం గంలో వ్యవస్థలన్నీ ఉత్పాదక సామర్థ్యం గల వ్యక్తులకు మాత్రమే కాక, మరింత ఎక్కువ పరిధినిమించిన సామర్ధ్యాలు గల వ్యక్తులను నియమించే దిశగా ప్రయత్నాలు సాగు తున్నాయి.
  • ఈ విధమైన ఉద్యోగుల, శ్రామికుల, వృత్తినిర్వాహకుల నియామకం యొక్క అవసరాన్ని ఇవ్వాళ అనేక వ్యవస్థలు గుర్తించాయి. విధి నిర్వాహణ మాత్రమే చక్కగా తెలిసివుంటే సరిపోదు. వ్యవస్థయొక్క ప్రధానమైన తత్వాన్ని తెలుసుకుని అందుకు నైస్పత్తికంగా సరిపోయే సాంకేతిక పరిజ్ఞానంతో బాటూ వ్యవస్థను ముందుకు తీసుకుపోగల అనేక ఇతర అనివార్యమైన సామర్ధ్యాలను కల్గివుండడం చాల ముఖ్యమని ఈ పరిశీలనలు మనకు చెప్పక చెప్తున్నాయి.

Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు పాలనా సామర్ధాన్ని నెలకొల్పడానికి ఈనాడు వృత్తిపరమైన నైపుణ్యం, విజ్ఞానం, ఆత్మపరిజ్ఞానం, అత్యున్నతమైన మానసిక వైఖరులు, అంతకన్నా అద్భుతమైన ప్రతిభా సంపదలు అవసరమై వున్నాయి. అందుచేత పోటీ ఆధారిత కార్యక్రమాలను చేపట్టే నేపధ్యంలో వ్యక్తుల నియామకాలలో ఈ క్రింది లక్షణాలను అంచనావేయడం ఒక వ్యాపార విజయ రహస్యంగా ఏర్పడింది.

Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు

  • సమిష్టిగా పనిచేసే నైపుణ్యాలు
  • నాయకత్వపు లక్షణాలు
    పరస్పర సంబంధాలను పెంచుకునే నైపుణ్యం కస్టమర్ కేర్
  • ఆత్మావగాహన, వ్యక్తిత్వవికాసం
  • ఈ చర్చను అంతటినీ ఒక చిన్న, సరళమైన నమూనా ద్వారా పరిశీలిద్దాం. పుదాహరణకు ఒక కార్యనిర్వాహకుని బాధ్యతల్లో ఒకదానిని తీసుకుందాం. తను పనిచేసే వ్యవస్థలో “ఫలితాత్మకమైన జట్టును నియమించడం” అనే అంశాన్ని గమనిస్తే,ఈ అంశంలో మూడు రకాల పరుధుల్లో విస్తృతమైన నైపుణ్యం ఉండాలని మనకు ఈ నూతన విధానం ద్వారా అవగతమవుతుంది.
  • వ్యక్తిగత నైపుణ్యాలు
  1. ప్రవర్తనలు వ్యాపార నైపుణ్యాలు
  2. కార్యాత్మక సామర్ధ్యం లేదా నైపుణ్యం
    Input ఇన్పుట్ Process ప్రోసెస్ Output అవుట్పుట్
    Personal skills వ్యక్తిగత నైపుణ్యాలు
  • వ్యాపార సంస్థలో ఒక జట్టును సమర్థవంతంగా తయారుచేయగల నిపుణుడైన కార్యనిర్వాహకునికి ఈ వ్యక్తిగత నైపుణ్యాలు చాలా చాలా అవసరం. ఈ నైపుణ్యాల పరిధిలోకి ఈ దిగువ అంశాలు కూడా వస్తాయి.
  • స్ఫూర్తిని అందివ్వడం ఇతరులను ప్రేరేపించగల్గటం.
    ఫలితాలను కాంక్షించడం
  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు సామర్ధ్యాన్ని పెంచే గుణం -స్ఫూర్తిని అందివ్వడం, ఇతరులను ప్రేరేపించగల్గటం.
    ఫలితాలపై మెగ్గు – ఫలితాలను కాంక్షించడం, ఫలితాలను కాంక్షించేలా చేయడం
    అభివృద్ధి లక్ష్యం -ఇతరులను అభివృద్ధి పర్చడంలో నమ్మకం సహజమైన “గురు” పాత్ర పోషి
    ఈ మూడు సామర్ధ్యాలు అనేక ఇతర స్వాభావిక లక్షణాల మేలు కలయిక. ఆ ఇతర స్వాభావిక లక్షణాలలో ఈ క్రింది లక్షణాలు వుంటాయి.
  • విలువలు వైఖరులు కారకాలు అనుభవం మూర్తిమత్వ అనుభవ
  • ఈ వ్యక్తిగత సామర్థ్యాలు విజయవంతమైన వ్యాపార లక్షణాలను ప్రదర్శించడానికే కాదు. జీవితంలో ఏ రకమైన సందర్భానికైనా ఇది వర్తిస్తుంది. ఈ గ్రంధంలో వ్యక్తిగత నైపుణ్యాలు అనే అధ్యాయంలో వీటిని మరింత వివరంగా చర్చించుకుందాం.


Business capabilities వ్యాపార సామర్ధ్యాలు


  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత సామర్థ్యాలనే బలమైన ఆయుధాలుగా చేసుకుని తన వ్యాపార సామర్ధ్యాలను ఏర్పరుచుకుంటాడు. మన ప్రవర్తన, చర్యలు వ్యాపార విధానాలలో తప్పక ప్రభావం చూపిస్తుందనేది ఇప్పుడు అందరికీ తెలుసున్న విషయమే. – మన వ్యక్తిగత చేవను వ్యాపారాత్మక చేవగా మార్చుకోవాలంటే ఈ క్రిందిలక్షణాలుకల్గివుండాలి.

  • నిర్వహణా పరిణామం వ్యవహార దక్షత అభివృద్ధిని మూల్యాంకనం చేయగల్గడం జట్టును తయారు చేసే నైపుణ్యం
    వ్యాపారాత్మక నైపుణ్యాల పరిధి నేటి వ్యాపార విజయానికి ఎంత అవసరమో వేరుగా చెప్పక్కర్లేదు. ఈ పరిధిలోకి చేర్చదగ్గ “మీ నాయకత్వ లక్షణాలను చెక్ చేసుకోండి”. “మీ వ్యవహార దక్షతను తెలుసుకోండి” అనే అంశాలను ఈ పుస్తకంలో మరొక చోట తెలుసుకుందాం.


Functional abilities కార్యాత్మక సామర్ధాలు


  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు “వ్యాపారం” మన వ్యక్తిగత సామర్ధ్యాలకు, వ్యాపార సామర్ధ్యాలకు ఒక దర్పణం. ఒక వ్యాపారంలో మన యొక్క ప్రభావాన్ని తేట తెల్లం చేసే అంశాలే ఈ కార్యాత్మక సామర్ధ్యాలు ఈ సామర్ధ్యాలలో ఎక్కువ శాతం, కార్యాత్మకంగాను, సాంకేతికంగాను వుంటాయి. ఈ కార్యాత్మక సామర్థ్యాలలో మనం ఈ క్రింది వాటిని చేర్చుకోవచ్చు.
  • Effective programs ఫలితాత్మకమైన కార్యక్రమాలు
    Effective development plans ఫలితాత్మకమైన అభివృద్ధి ప్రణాళికలు
    Generating effective proposals ఫలితాత్మకమైన ప్రతిపాదనలను జనింపచేయడం
    Coaching, Counseling, Abilities కోచింగ్, కౌన్సిలింగ్, సామర్ధ్యాలు
    Ability to train శిక్షణ ఇవ్వగల్గటం
Business practice వ్యాపార సాధన
  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు ఒక వ్యాపారంలో విజయం సాధించడానికి ఈ మూడు అంశాల ప్రమేయం అపారంగా వుంటుంది. ఒక “వ్యాపారం” అనే కార్యక్రమం ఆధునిక అవసరాల నేపధ్యంలో ఏ ఆకృతిలో వుండాలో ఈ నమూనా మనకు వివరంగా తెలియచేస్తుంది.

  • వ్యక్తిగత సామర్ధ్యాలు, వ్యాపార సామర్ధ్యాలు, కార్యాత్మక సామర్థ్యాలు ఈ మూడు అంశాలు ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా ముడిపడి వుంటాయి. ఏ చోటనైనా కాస్త బలహీనమైనా మొత్తం “విజయం” అంతా తీవ్రంగాప్రభావితమవుతుంది.
  • Business Success Secrets వ్యాపార విజయ రహస్యాలు వ్యాపారాత్మకంగా ఎదురయ్యే అవరోధాలను అవలీలగా అధిగమించ గల స్వభావాన్ని ఒక నిర్వాహకునికి సంబంధించిన వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగపడ్తాయి.
  • చాలామంది పైకి కన్పించే లక్షణాలనే చూస్తారు. విజయానికి దారితీసిన అసలు వాస్తవాలను గ్రహించలేం. ఆ వాస్తవాలను కారకాలను తెలుపుతుంది.

 

2 Comments
  1. Gamebetvina, eh? Another one from the land of Pho! Wonder if they got any unique games. Fingers crossed for some originality! Worth a punt. Check out gamebetvina.

Leave a reply

vihaanadhithan.com
Logo
Shopping cart