
Read the newspaper.
న్యూస్ పేపరు చదవండి
ఈ మధ్య ఒక మల్టీనేషనల్ కంపెనీవారు క్యాంపస్ సెలక్షన్లకై ఒక ఇంజనీరింగ్ కాలేజికి వెళ్ళారు. అందరికన్నా అత్యధిక మార్కులు సాధించిన ఒక అభ్యర్థిని వారు ఒక ప్రశ్న అడిగారు “చెక్కుకి, డిమాండ్ డ్రాఫ్ట్క తేడా ఏమిటి?”
“నాకు తెలియదు” అన్నాడు ఆ జీనియస్. “అటువంటివన్నీ మా డాడీ చేస్తారు. నాపని బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవటమే” అన్నాడు అమాయకంగా, ఆ కంపెనీ వారు ఉద్యోగం ఇవ్వలేదని మీరు ఊహించే ఉంటారు. అదే జరిగింది.

మన దేశంలో చాలామంది
ఇటువంటి స్టూడెంట్స్ మన దేశంలో చాలామంది ఉన్నారు. అన్ని పనులు తల్లిదండ్రులే చేస్తూ, పిల్లల్ని మార్కులు సంపాదించే ర్యాంకర్లను చేస్తున్నారు. ఉద్యోగంలో చేరాక ఈ ర్యాంకులు పనికిరావు. నైపుణ్యాలు కావాలి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ పై పట్టుఉండాలి. Read the newspaper. న్యూస్ పేపరు చదవండి.
కాలేజిలో చేరే స్టూడెంట్స్ మొదటిరోజు నుండి న్యూస్ పేపరు చదివే అలవాటు చేసుకోండి. న్యూస్ పేపరులో ఆఖరి పేజీలోని క్రీడలేకాదు, మొదటి పేజీ మొత్తం చదవండి. వీలుంటే ఎడిటోరియల్ కూడా చదవండి. సమాచారంతో సరైన అవగాహన
ఉంటుంది.
నేను బి.ఏ చదివేటప్పుడు నారాయణమూర్తి అనే క్లాస్ మేట్ రోజూ లైబ్రరీకి వెళ్ళి రెండు మూడు పేపర్లు చదివేవాడు. ఒకసారి ఒక లెక్చరర్, “పేపరు చదవొచ్చులే ముందు నీ పుస్తకాలు చదువు” అని కూడా హెచ్చరించారు. ఆ పేపరు చదవటం వలన అతడు శ్రద్ధపెంచుకుని IAAS అయ్యాడు. అతను ఆ స్థాయికి రావటానికి న్యూస్ పేపర్ పఠనమే కారణమని, మిగతావారికి తరువాత తెలిసింది.
అతనితోపాటు నేను కూడా తప్పనిసరై లైబ్రరీకి వెళ్ళి, అవి, ఇవి చదవటం వలన ఇలా రాయగలుగుతున్నాను.
అతను ఇటీవలి వరకు మన రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ఆఫీసుకి అత్యున్నత స్థాయిలో పనిచేశాడు. Read the newspaper. న్యూస్ పేపరు చదవండి.
చదువుకునే ప్రతి స్టూడెంట్‌కి ఇది ఎంతో అవసరం. ఇంతవరకు వేలాది విద్యార్థులు ఈ టెక్నిక్ ద్వారా, తమ చదువుకి ప్రణాళిక వేసుకున్నారు. మీకు కూడా తప్పుకు
ఉపయోగపడుతుంది. Read the newspaper. న్యూస్ పేపరు చదవండి.
SUCCESS NEXAMS
STRESS
SELF TESTS
STUDY NOTES
STRATEGIES
STUDY PLANNING
STUDY ATMOSPHERE
STUDY TIME

Study time : అంటే మనం రోజూ చదువుకునే సమయం నిర్ణయించుకోవాలి. అది తెల్లవారు ఝామునా? రాత్రివేళా? మీదే నిర్ణయం.
Study atmosphere – చదువుకునే సమయంలో చుట్టూ ప్రశాంతంగా ఉండాలి. Study Planning అంటే ఒక సిట్టింగ్ లో ఒకటే సబ్జక్టు చదవండి. Read the newspaper. న్యూస్ పేపరు చదవండి.
Strategies అంటే చదవటానికి కొన్ని చిట్కాలు తయారు చేసుకోండి. అలాంటివి ఈ పుస్తకంలో ఉన్నాయి. రQ6R
Study Notes : చదువుకున్న విషయాన్ని ఒక పుస్తకంలో బిట్స్లోగ రాసుకోండి. దాన్ని సినాప్సిస్ (SYNOPSIS) అంటారు.
Self Test : పాఠం చదివాకా మీకు మీరే చిన్న పరీక్షపెట్టుకోండి. అది పేపరు మీదే కానవసరం లేదు.
Stress management : అంటే ఒత్తిడిని తట్టుకునే మార్గాలను అవలంబించండి. చివరిగా Success in exams, అంటే అది మీదే.
కాలేజీ క్యాంపస్
గతంలో వచ్చిన మార్కులతో పోల్చుకోకండి Read the newspaper. న్యూస్ పేపరు చదవండి.
కొన్ని రాష్ట్రాలలో ప్రతి విద్యార్థి పదవతరగతి వరకు సునాయాసంగా పాస్ అవుతాడు. రోజూ బడికి వెళ్ళి, పరీక్షలన్నీ రాస్తే పాస్ గ్యారంటీ, నిజానికి ఫెయిలవటమే కష్టం. మార్కులు కూడా 90 శాతం పైమాటే. అందరూ టాపర్లే.
దానికి చాలా కారణాలుంటాయి.
మా రోజుల్లో ఎవరికైనా 60 శాతం వస్తే ఎక్సలెంట్ స్టూడెంట్ అనేవారు. అంటే ఈ కాలం పిల్లలు అందరూ అద్భుతంగా చదువుతున్నారని కాదు. ఎక్కువమంది బట్టీ విధానానికి అలవాటు పడిపోయారు. ఇక ఇంటర్ మీడియట్లో, కొన్ని జూనియర్ కాలేజీలవారు, పిల్లల మీద ఒత్తిడి పెంచి చదివిస్తున్నారు. అక్కడ కూడా చాలామంచి మార్కులు వస్తున్నాయి.
ఇటువంటి విద్యార్థులు, డిగ్రీలో చేరాక సమస్యలు తలెత్తుతున్నాయి. పదిలో, ఇంటర్లో ఒక పక్క పేరెంట్స్, మరోపక్క టీచర్లు, ఇంకో పక్క కాలేజి యాజమాన్యాలు చదివించారు. ఇప్పుడు అంతా కొత్తగా ఉండవచ్చు. అయినా భయపడవద్దు, కంగారు పడవద్దు, ఆందోళన అసలే వద్దు. కొంతకాలం ఓపిక పట్టాలి. కాలమే కొన్ని పరిష్కరిస్తుంది. ప్రతి క్లాసుకి వెళ్ళండి, డౌట్స్ ఉంటే టీచర్లను అడగండి, సమయాన్ని వృథా చేయకండి. ఇప్పుడు కూడా 90 శాతం మార్కులు తెచ్చుకోగలరు.
దానికి “6 P” టెక్నిక్ పనికొస్తుంది. అవి Planning (ప్రణాళిక), Preparation (సిద్ధం కావటం), Passion (బలమైనకోరిక), Patience (ఓపిక), Practice (సాధన) చివరిగా Perfection (నిష్ణాతులు కావటం). A DO
ఇప్పుడు స్వయంశక్తితో మీరు అద్భుతాలు సాధించగలరు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఇప్పుడు ఉద్యోగాలిచ్చేవారు, అభ్యర్థి మార్కులకన్నా అతనికి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, సబ్జక్టు మీద ఎంత పట్టు ఉందో తెలుసుకునే ప్రశ్నలు సంధిస్తున్నారు.
అన్ని పుస్తకాలు చదవండి
మీ చదువుకి సంబంధించిన పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు, జర్నల్స్ వీలైనప్పుడల్లా చూస్తూ ఉండండి. ఆసక్తికరంగా ఉన్న వార్తలు, వాక్యాలు చదవండి. మరీ ఆసక్తిగా అనిపిస్తే వాటిని ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి.
ఒకసారి నా స్నేహితుడి కుమార్తె ఇలా పుస్తకాలు తిరగేస్తూ Health గురించి W.H.O వారు ఇచ్చిన Definition రాసుకుంది “Health is complete State of Physical Mental and Social wellbeing, but not merely the absence of disease or
deformity” తనకు తెలియకుండానే అది రెండు మూడుసార్లు చదివి గుర్తు పెట్టుకుంది.
ఒకసారి హిందీలో ప్రసారమయ్యే “కౌన్ బనేగా కరోడ్‌పతి” అనే కార్యక్రమంలో పాల్గొనాలని కోరికతో ప్రయత్నించింది. ఆమెకు అమితాబ్ బచన్ నుండి పిలుపువచ్చింది. అందులో పాల్గొని 25 లక్షల వరకు వెళ్ళింది. తరువాత ప్రశ్నగా ఆయన W.H.O వారు Health కి ఇచ్చిన డెఫినిషనే అడిగారు.
ఇంకేముంది? ఎప్పుడో గుర్తుంచుకున్నది చెప్పింది. 50 లక్షలు వచ్చింది. ఇంకచాలు అనుకుంది. పోటీ నుండి తప్పుకుని, ఇచ్చిన డబ్బు తెచ్చుకుంది. తండ్రికి ఇచ్చింది. చక్కని ఇల్లు కొనుక్కున్నారు. మంచి చదువు పూర్తి చేసింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తోంది. పుస్తకాలు చదువుతూనే ఉంది. మరి భవిష్యత్తులో ఇంకేం చేయబోతోందో?
పుస్తకాలు చదివే హాబీ ఉన్నవారికి మానసిక సమస్యలు ఉండవని సైకాలజిస్టుల పరిశోధనల్లో తేలింది. అలాంటి అలవాటు లేని వారు తీరిగ్గా కూర్చుని ఉన్న సమస్యలు, లేని సమస్యలు ఆలోచించుకుంటూ మనసు పాడు చేసుకుంటారు.
పుస్తకాలను మించిన నేస్తాలు మరేం ఉంటాయి ఆలోచించండి.
Vihaan Adhithan Official Website: https://vihaanadhithan.com/