
మీరు పాఠశాలలో ఉన్నప్పుడు తెలివైన స్టూడెంట్ కావొచ్చు. క్లాస్ టాపర్ కావొచ్చు. కానీ కొత్త కాలేజిలో అలా ఉండకపోవచ్చు. అక్కడ మీలాంటి టాపర్లే ఉంటారు. మీకు గతంలోని గుర్తింపు లభించకపోవచ్చు. దాని గురించి వర్రీ కావొద్దు. కాలేజి చదువుల్లో చదువుతో పాటు నేర్చుకోవలసిన విషయాలెన్నో ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది మార్పుని అంగీకరించటం. ఈ విషయంలో ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్‌ని ఆదర్శంగా తీసుకోవాలి.ఓటమి కూడా గెలుపులో భాగమే

భారత చిత్ర సీమలో మకుటంలేని మహారాజుగా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చనికి వయసు పెరగటంతో అవకాశాలు తగ్గాయి. కొత్త కొత్త హీరోలు వచ్చారు. ఓటమి కూడా గెలుపులో భాగమే ఆ పరిస్థితిలో అమితాబ్ డిప్రెషన్‌కి గురవలేదు. గతంలో దిలీప్‌కుమార్, రాజ్‌కుమార్‌లకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు అనుకుని, బుల్లితెర ప్రవేశం చేశాడు. పెద్ద సినిమాల్లో పెద్ద హీరోగా ఉన్న నేను ఇంత చిన్న టీవీలోకి రావటమా అని నామోషీ పడలేదు. “కౌన్ బనేగా కరోడ్ పతి” అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
కౌన్ బనేగా కరోడ్ పతి అడిగే ప్రశ్నల్లో కొత్తవేవీ లేవు, కానీ తన ఇమేజ్ ద్వారా కొత్తగా ప్రదర్శించాడు. ఆ కార్యక్రమం ప్రసారం అయ్యే సమయంలో సినిమా హాళ్ళు కలెక్షన్స్ డల్‌గా ఉండేవి. చివరకు, సినిమా రంగంలో ఉండగా చేసిన అప్పులన్నీ టీవీలో చేరాకా తీర్చేశాడు.
ఇప్పుడు 70 ఏళ్ళు దాటిన తాతగారైనా, ఆయన అభిమానులు పెరుగుతూనే ఉన్నారు.
నమ్మకాలు సరే! నిజం ఏమిటి? ఓటమి కూడా గెలుపులో భాగమే
నమ్మకాలు సరే! నిజం ఏమిటి?
పరీక్షకి వెళ్తూంటే, పిల్లి ఎదురొచ్చిందనీ, కట్టెల మోపు ఎదురొచ్చిందనీ, వెనక్కి వచ్చిన వారున్నారని తెలుసా?
అమావాస్యనాడు కొత్త పనులు చేయటానికి, తెలుగువారు మాత్రమే భయపడతారని తెలుసా? తమిళనాడులో అమావాస్య చాలా మంచిరోజు. ఓటమి కూడా గెలుపులో భాగమే
ఊరెళ్ళేముందు ఎవరైనా తుమ్మితే అశుభం అని నమ్మేవారున్నారంటే ఆశ్చర్యంగా లేదూ. పైగా వెనక్కివచ్చి ఒక గ్లాసు నీళ్ళు తాగి వెళ్ళాలట.
ఇంటిముందు ముగ్గువేస్తే, ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని గాఢంగా నమ్మేవారున్నారు (ప్రపంచంలో కోటీశ్వరులు బిల్ గేట్స్, వారన్ బఫెట్ల ఇంటి ముందు ముగ్గులు లేవు)
ఇంకా ఇలాంటి మూఢ నమ్మకాలు, అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. వీటి వెనుక ఒక కారణం ఉండవచ్చు.
ఊరెళ్ళే ముందు తుమ్మితే, వారి ఆరోగ్యం బాగాలేదని, అమావాస్య నాడు త్వరగా చీకటి పడుతుంది కాబట్టి, ఆ రోజు పొలం పనులు చేయొద్దని, ఇంటిముందు ముగ్గువేస్తే, ఆఘాటు వలన ఇంటివెనకనున్న పాడి పశువుల పెంటనుండి వచ్చే బ్యాక్టీరియా ఇంట్లోకి రాలేదనీ ఇలా… అనేక కారణాలుంటాయి. వాటిని మనం ఈనాటికీ పట్టుకు వేళ్ళాడకూడదు. కాలేజి విద్యార్థులు, ప్రతి విషయం రేషనల్‌గా ఆలోచించటం మొదలు పెట్టండి. వాటికి సలహాలు ఇవిగో. ఓటమి కూడా గెలుపులో భాగమే
నమ్మకాలు సరే, వాటికి సైంటిఫిక్ రీజన్ తెలుసుకోండి.
మీ పరీక్షలో ఏ నంబరు వచ్చినా బాగా చదివితే విజయం మీదే. మంచిరోజు, చెడ్డరోజు అంటూ ఏమీ లేదు. మీకు అన్నీ మంచివే. ఓటమి కూడా గెలుపులో భాగమే
నమ్మకాల వలన మంచి జరిగితే ఫరవాలేదు, కానీ దాని వెనుక మీ కృషి ఉందని మర్చిపోవద్దు. అలాగే చెడు జరిగితే దాని వెనక మీ భయం ఉంది. అంతా మైండ్
కండిషనింగ్ (Mind Conditioning) మాత్రమే.

నంబర్లు-నమ్మకాలు
నంబర్లు-నమ్మకాలు
కొంతమంది స్టూడెంట్స్‌కి కొత్తకాలేజిలో, తమ రోల్ నంబరు గురించి ఓటమి కూడా గెలుపులో భాగమే
నమ్మకాలుంటాయి. సరి సంఖ్య మాత్రమే ఉండాలనీ, చివర్లో సున్న ఉండకూడదనీ, 9 కానీ, 18, 27, 36, 45… ఉంటే తప్పక పాసవుతామని, ఎందుకంటే వాటిమొత్తం కూడితే 9 వస్తుందని నమ్ముతారు. తమ సెల్‌ఫోను నంబర్లు, బైక్ నంబర్లు, కారు నంబర్లు కూడా తొమ్మిది రావాలనే మూఢ నమ్మకం ఉంది. అలాగే మరి కొందరికి 7 నంబరు మీద పిచ్చినమ్మకం ఉంటుంది.
నిజానికి మీరు కోరుకునే నంబర్లు ఉన్నంత మాత్రానే మీరు విజయం సాధిస్తారని అనుకోవటం మూఢనమ్మకం. దేనికైనా మీరు చదివి తీరాల్సిందే. జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ మధ్య హైదరాబాదు ఔటర్‌రింగ్ రోడ్లో ఒక్కరు భయంకరమైన ఆక్సిడెంటుకి గురయింది. ఇద్దరు ఫస్టియర్ ఇంజనీరింగు విద్యార్థులు మరణించారు. ఆ కారు నంబరు 9999. అలాగే నా క్లాస్మేట్ హైస్కూలు వరకు రోల్ నంబరు 9లో ఉండేవాడు. నాకు తెలిసి అతడు 9వ తరగతి 4 సార్లు తప్పాడు.
ప్రముఖ తెలుగు వ్యక్తి శ్రీ ఎన్.టి.రామారావుకి కూడా 9 నంబరు అంటే ఇష్టం ఉండేది. 9 నెలల్లో అధికారంలోకి రావటంతో ఆయనకు ఆ విశ్వాసం కలిగి ఉండవచ్చు. తరువాత 9 నంబరు ఆయనకు అచ్చిరాలేదు. 9మంది పార్లమెంటు సభ్యులు పార్టీవీడారు. రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా, 10వ ముఖ్యమంత్రిగా పనిచేశారు 9వసారి ఓడిపోయారు. చివరకు ఆయన మరణించిన తేదీ 18 అంటే 1+8=9. కాబట్టి నంబరు నమ్మకం విడిచిపెట్టండి.
మీరూ ఆలోచించండి.
కేవలం ఒక ప్రత్యేక నంబరు ఉండటంవలన విజయం సాధించటం సాధ్యమేనా? అది నిజమైతే ఆ నంబరు హాల్‌టికెట్ ఉన్నవారందరూ అద్భుత విజయం సాధించాలి ఆ తారీఖున వ్యాపారం ప్రారంభించిన వారందరూ కోట్లకు పడగలెత్తాలి. ఇక ఆరోజు బర్తడే చేసుకునేవారు అమరులైపోవాలి.
ఆలోచించండి. దేనికైనా ముఖ్యం మన నమ్మకం కాబట్టి ఈ రోజు నుండి నంబర్ల ఆలోచనకి అంతం పలకండి. Any Number is lucky Number అనుకోండి.
పేరులో ఏముంది? ఓటమి కూడా గెలుపులో భాగమే
పేరులో ఏముంది?
పేరు మార్చుకుంటే, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయని కొంతమంది నమ్మకం. కానీ అది మూఢనమ్మకం మాత్రమే. ఓటమి కూడా గెలుపులో భాగమేపేరు కన్నా తీరు మార్చుకుంటే విజయం మనకు తప్పక చేకూరుతుంది.
అమ్మానాన్నలు పెట్టిన పేరు నచ్చలేదని మార్చుకున్నా, లేదా స్టైలిష్‌గా ఉండాలని కొత్తపేరు పెట్టుకున్నా ఫరవాలేదు. కానీ తమ పేరులోని అక్షరాల మొత్తం అరిష్టం తెస్తుందని, స్పెల్లింగులు మార్చుకున్నవారున్నారు. మార్చుకున్నందువలన సైకలాజికల్‌గా కొంత తేడా కనిపించవచ్చుకానీ మార్చుకున్నందువలనే లాభం జరుగుతుందనే దానికి శాస్త్రీయ సమాధానం లేదు.
ఉదాహరణకు నాపేరులో 13 అక్షరాలున్నాయి. చాలామంది 13 నంబరు మంచిది కాదు అంటారు. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా 13ని దురదృష్ట సంఖ్యగా భావిస్తారు. 13వ నంబరు రోడ్లు ఉండవు. ఒకసారి నా స్నేహితుడొకడు నా పేరుని B.V.PATTABHI RAM అనే 13 అక్షరాలను 12గా మార్చుకోమన్నాడు BHI బదులు BI మంచిదని చెప్పాడు. కానీ నేను మార్చుకోలేదు. నేను బాగానే ఉన్నాను. అనుకున్న దానికన్నా ప్రొఫెషనల్‌గా అకడమిక్ గా ఇంకా బావున్నాను.
మైడియర్ స్టూడెంట్స్, మీ పేరు, ప్రతిష్ఠ అన్నీ మీ చేతిలో ఉన్నాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించటం కన్నా, చదువుమీద ధ్యాస పెట్టండి. మీ చేతలు బాగుంటే రాతలు కూడా బావుంటాయి. పేరు బావుంటే ప్రతిష్ఠ పెరుగుతుందనే నమ్మకానికి ఓ నమస్కారం పెట్టి, మీ ప్రతిభకి సానపట్టే ప్రయత్నాలు ప్రారంభించండి.
మీపేరు విషయంలో, మతం విషయాల్లో విశ్వాసం పెంచుకోండి. అవి మార్చుకోవటం వలన అద్భుతాలు జరుగుతాయనీ, అనుకున్నవన్నీ జరుగుతాయని అనుకోవటం అంధవిశ్వాసం. మీరు ఎలా జన్మించారో, ఎలా పెరిగారో అదే నమ్మండి. మార్పిడీలు మార్పు తెస్తాయనుకోకండి. అది ఒక మూఢనమ్మకం మాత్రమే.
ఓటమి మనకు ఇచ్చే పాఠాలు:
- తప్పులను సరిదిద్దుకోవడం: ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునే అవకాశం కేవలం ఓటమి ద్వారానే లభిస్తుంది.
- అనుభవం: గెలుపు ఆనందాన్ని ఇస్తే, ఓటమి పాఠాన్ని నేర్పుతుంది. ఈ అనుభవమే భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది.
- మనోధైర్యం: పడినా తిరిగి లేవగలమనే నమ్మకం (Resilience) ఓటమిని ఎదుర్కొన్నప్పుడే వస్తుంది.
- వినమ్రత: విజయం తలకెక్కకుండా ఉండాలంటే, గతంలో మనం ఎదుర్కొన్న కష్టాలు, ఓటములు గుర్తుండాలి.