
హైస్కూలు చదువులో మనకు ఒకటి రెండు
హైస్కూలు చదువులో మనకు ఒకటి రెండు ఫేవరేట్ సబ్జక్టులుంటాయి. కొందరికి సైన్సు ఇష్టం, కొందరికి లెక్కలంటే మక్కువ, కొందరికి ఇంగ్లీషు… ఇలా ఉంటాయి. కానీ కాలేజిలో చేరాకా, ఇక్కడ ఒకే సబ్జక్టుకు సంబంధించిన భాగాలుంటాయి. కష్టమైనది ముందు చదవండి
ఆర్ట్స్, సైన్సు, కామర్స్, ఇంజనీరింగు, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ… ఉంటాయి. వీటిల్లో మనకు ఇష్టాయిష్టాలు ఉండకూడదు. ఎటొచ్చీ హైస్కూల్లో బేసిక్స్ ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది. అందుకే కొంత ఇష్టం. కొంత ఓపిక అవసరం. వాటికి కొంత సమయం అధికంగా కేటాయించండి. కష్టమైనది ముందు చదవండి

“When you have to swallow two frogs first swallow the bigger one” అంటాడు బ్రెయిన్ ట్రీసీ అనే మేనేజ్మెంటు నిపుణుడు. అంటే మీరు రెండు కప్పల్ని మింగాల్సి వస్తే, ముందుగా పెద్దకప్పని మింగండి, ఆ తరువాత రెండవది సునాయాసంగా మింగవచ్చు. మనకు రెండు సమస్యలున్నప్పుడు, వాటిల్లో పెద్ద సమస్యను ముందు చేపట్టండి, పరిష్కరించండి. రెండవది సునాయాసంగా చేయవచ్చు.
స్టూడెంట్స్ తమకు ఇష్టమైన సబ్జక్టునే పదే పదే చదువుతుంటారు. అలాకాకుండా, కష్టమైన సబ్జక్టుకు ఎక్కువ సమయం కేటాయించండి. దాన్ని ఔపోసన పట్టండి మీకొచ్చిన సబ్జక్టు ఎప్పుడైనా చదవొచ్చు.
మరో ముఖ్య విషయమేమిటంటే, మీ సీనియర్లలో కొందరు ఫలానా సబ్జక్టు కష్టమనీ, మరొకటి సులువైనదనీ స్టేట్మెంట్లు ఇస్తుంటారు
. అది వారి అభిప్రాయం మాత్రమేనని గుర్తించండి. అలాగే కొందరు ప్రాస కుదిరిందని పదాలు కూర్చుతుంటారు. “బోటనీ క్లాసంటే బోరు బోరు”, “కెమిస్ట్రీ అంటే కెవ్వుకేక”, “హిస్టరీ క్లాసంటే రొష్టు రొష్టు”. ఇవి వరస బాగుంటాయి కానీ వాస్తవం కాదు.
వాస్తవానికి ఒక సబ్జక్టు అంటే ఇష్టం ఉన్నవారు మరో సబ్జక్టు మీద శ్రద్ధ పెంచుకోవచ్చు. ఎందుకంటే నేర్చుకునే ఆసక్తి సహజంగానే ఉంది. కష్టమైనది ముందు చదవండి
అన్ని పుస్తకాలు చదవండి
మీ చదువుకి సంబంధించిన పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు, జర్నల్స్ వీలైనప్పుడల్లా చూస్తూ ఉండండి. ఆసక్తికరంగా ఉన్న వార్తలు, వాక్యాలు చదవండి. మరీ ఆసక్తిగా అనిపిస్తే వాటిని ఒక నోట్బుక్ లో రాసుకోండి.
ఒకసారి నా స్నేహితుడి కుమార్తె ఇలా పుస్తకాలు తిరగేస్తూ Health గురించి W.H.O వారు ఇచ్చిన Definition రాసుకుంది “Health is complete State of Physical Mental and Social wellbeing, but not merely the absence of disease or deformity” తనకు తెలియకుండానే అది రెండు మూడుసార్లు చదివి గుర్తు పెట్టుకుంది.

ఒకసారి హిందీలో ప్రసారమయ్యే “కౌన్బనేగా కరోడ్పతి” అనే కార్యక్రమంలో పాల్గొనాలని కోరికతో ప్రయత్నించింది. ఆమెకు అమితాబ్ బచన్ నుండి పిలుపువచ్చింది. అందులో పాల్గొని 25 లక్షల వరకు వెళ్ళింది. తరువాత ప్రశ్నగా ఆయన W.H.O వారు Health కి ఇచ్చిన డెఫినిషనే అడిగారు.
ఇంకేముంది? ఎప్పుడో గుర్తుంచుకున్నది చెప్పింది.
50 లక్షలు వచ్చింది. ఇంకచాలు అనుకుంది. పోటీ నుండి తప్పుకుని, ఇచ్చిన డబ్బు తెచ్చుకుంది. తండ్రికి ఇచ్చింది. చక్కని ఇల్లు కొనుక్కున్నారు. మంచి చదువు పూర్తి చేసింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తోంది. పుస్తకాలు చదువుతూనే ఉంది. మరి భవిష్యత్తులో ఇంకేం చేయబోతోందో?
పుస్తకాలు చదివే హాబీ ఉన్నవారికి మానసిక సమస్యలు ఉండవని సైకాలజిస్టుల పరిశోధనల్లో తేలింది.
అలాంటి అలవాటు లేని వారు తీరిగ్గా కూర్చుని ఉన్న సమస్యలు, లేని సమస్యలు ఆలోచించుకుంటూ మనసు పాడు చేసుకుంటారు.కష్టమైనది ముందు చదవండి
పుస్తకాలను మించిన నేస్తాలు మరేం ఉంటాయి ఆలోచించండి.
జోక్స్ పుస్తకాలు చదవండి
జోక్స్ పుస్తకాలు చదవండి ‘Humour is the best medicine” అంటారు అనుభవజ్ఞులు. ప్రతిరోజూ ప్రశాంతంగా ఉంటుందని అనుకోటానికి వీల్లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. అవి కుటుంబం, స్నేహం, చదువు, ఆర్థిక ఇబ్బందులు ఏవైనా కావొచ్చు. ఆ సమస్యలతో మనసు కలవరపడినప్పుడు మంచి జోక్స్ చదవండి. ఈ రోజుల్లో ప్రతి పుస్తకంలో, ఇంటర్నెట్లో, సెల్ ఫోన్ మెసేజిల్లో మంచి నవ్వు పుట్టించే జోక్స్, కార్టూన్స్ వస్తున్నాయి.
అవి చదవండి, నవ్వుకోండి, వాటిని గుర్తుపెట్టుకోండి. మంచి జోక్స్ ఒక నోట్ బుక్లో రాసుకోండి.
కాలేజిల్లో నలుగురితో ఉన్నప్పుడు, సరదాగా కలిసిపోయి ఈ జోక్స్ చెప్పండి. మీకు అందరూ అభిమానులవుతారు. జోక్స్ చెప్పాలంటే ముందుగా ఇతరులు జోక్స్ చెప్పినప్పుడు, వారిని గమనించండి. బాగా జోక్స్ చెప్పేవారు ముందుగా నవ్వరు, నవ్వుతూ చెప్పరు.కష్టమైనది ముందు చదవండి
చివరి క్లైమాక్స్ చెప్పినప్పుడు అందరూ పగలబడి నవ్వుతారు. మీరు కూడా అలాగే సాధన చెయ్యండి. స్టూడెంట్స్ తమకు ఇష్టమైన సబ్జక్టునే పదే పదే చదువుతుంటారు. కష్టమైనది ముందు చదవండి హైస్కూలు చదువులో మనకు ఒకటి రెండు ఫేవరేట్ సబ్జక్టులుంటాయి. కొందరికి సైన్సు ఇష్టం, కొందరికి లెక్కలంటే మక్కువ, కొందరికి ఇంగ్లీషు… ఇలా ఉంటాయి. కానీ కాలేజిలో చేరాకా, ఇక్కడ ఒకే సబ్జక్టుకు సంబంధించిన భాగాలుంటాయి. కష్టమైనది ముందు చదవండి
విదేశాల్లో సైకాలజీ క్లినిక్కుల్లో చార్లీచాప్లిన్ సినిమాలు, కార్టూన్ నెట్వర్కు వీడియోలు చూపిస్తుంటారు. దానివలన మనసు ఆహ్లాదంగా ఉంటుంది.
హాస్యం అంటే అపహాస్యం చేసే జోకులు కాదు. ఒకరిని కించపరిచే జోకులు కాదు. తెలుగులో శ్రీ జంధ్యాలవారి సినిమాలు బాపుగారి కార్టూన్లు, ముళ్ళపూడి వెంకట రమణగారి జోక్స్ పుస్తకాలు చూడండి. మనసుకి, శరీరానికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కష్టమైనది ముందు చదవండి అన్ని పుస్తకాలు చదవండి.
“నవ్వు నాలుగందాల చేటు” అనేది పాతకాలం సామెత. ఇప్పుడు “నవ్వు నాలుగందాల బెస్టు” అనుకోవాలి. కొందరికి ఇంగ్లీషు… ఇలా ఉంటాయి. కానీ కాలేజిలో చేరాకా, ఇక్కడ ఒకే సబ్జక్టుకు సంబంధించిన భాగాలుంటాయి. కష్టమైనది ముందు చదవండి అన్ని పుస్తకాలు చదవండి
మీ చదువుకి సంబంధించిన పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు, జర్నల్స్ వీలైనప్పుడల్లా చూస్తూ ఉండండి. ఆసక్తికరంగా ఉన్న వార్తలు, వాక్యాలు చదవండి. మరీ ఆసక్తిగా అనిపిస్తే వాటిని ఒక నోట్బుక్ లో రాసుకోండి.